Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

సామెతలు1

Pro 1:1  దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొ మోను సామెతలు. 
Pro 1:2  జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును 
Pro 1:3  నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును 
Pro 1:4  జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. 
Pro 1:5  జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపా దించుకొనును. 
Pro 1:6  వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. 
Pro 1:7  యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. 
Pro 1:8  నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. 
Pro 1:9  అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును 
Pro 1:10  నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. 
Pro 1:11  మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము 
Pro 1:12  పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయు దము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. 
Pro 1:13  పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము 
Pro 1:14  నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. 
Pro 1:15  నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము. 
Pro 1:16  కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. 
Pro 1:17  పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. 
Pro 1:18  వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. 
Pro 1:19  ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును. 
Pro 1:20  జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది 
Pro 1:21  గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయు చున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది 
Pro 1:22  ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు? 
Pro 1:23  నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను. 
Pro 1:24  నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి 
Pro 1:25  నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. 
Pro 1:26  కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను 
Pro 1:27  భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. 
Pro 1:28  అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును. 
Pro 1:29  జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను. 
Pro 1:30  నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. 
Pro 1:31  కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుస రించెదరు 
Pro 1:32  జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు. 
Pro 1:33  నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.
 Download Audio File 

No comments:

Post a Comment