Pro 17:1 రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
Pro 17:2 బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచు కొనును.
Pro 17:3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.
Pro 17:4 చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధి కుడు చెవియొగ్గును.
Pro 17:5 బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించు వాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచ బడడు.
Pro 17:6 కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము.
Pro 17:7 అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.
Pro 17:8 లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవ ర్తించును.
Pro 17:9 ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.
Pro 17:10 బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.
Pro 17:11 తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును.
Pro 17:12 పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు
Pro 17:13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని యింటనుండి కీడు తొలగిపోదు.
Pro 17:14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు
Pro 17:15 నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు.
Pro 17:16 బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా?
Pro 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
Pro 17:18 తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.
Pro 17:19 కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.
Pro 17:20 కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును.
Pro 17:21 బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు.
Pro 17:22 సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
Pro 17:23 న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.
Pro 17:24 జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనువి కన్నులు భూదిగంతములలో ఉండును.
Pro 17:25 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును
Pro 17:26 నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే.
Pro 17:27 మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.
Pro 17:28 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.
Download Audio File

No comments:
Post a Comment