Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

సామెతలు19

Pro 19:1  బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. 
Pro 19:2  ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును 
Pro 19:3  అట్టివాడు హృదయమున యెహోవామీద కోపిం చును. 
Pro 19:4  ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. 
Pro 19:5  కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు. 
Pro 19:6  అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే. 
Pro 19:7  బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు. 
Pro 19:8  బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉప కారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. 
Pro 19:9  కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును. 
Pro 19:10  భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు. 
Pro 19:11  ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. 
Pro 19:12  రాజు కోపము సింహగర్జనవంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది. 
Pro 19:13  బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటుతెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువు లతో సమానము. 
Pro 19:14  గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము. 
Pro 19:15  సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును. 
Pro 19:16  ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును. 
Pro 19:17  బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. 
Pro 19:18  బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు. 
Pro 19:19  మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును. 
Pro 19:20  నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. 
Pro 19:21  నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము. 
Pro 19:22  కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు. 
Pro 19:23  యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును. 
Pro 19:24  సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు. 
Pro 19:25  అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందు దురు. 
Pro 19:26  తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. 
Pro 19:27  నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. 
Pro 19:28  వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. 
Pro 19:29  అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి. 
Download Audio File 

No comments:

Post a Comment